![]() |
బాలీవుడ్ సంచలనం, ‘నేషనల్ క్రష్’ తృప్తి డిమ్రి క్రేజ్ ప్రస్తుతం రోజురోజుకూ స్కై రాకెట్లా దూసుకుపోతోంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ, వరుస ప్రాజెక్టులతో కెరీర్ లో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ భామ నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘మా బెహన్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఈ సక్సెస్ జోష్ లో ఉండగానే, ముంబైలో ఆమె కొనుగోలు చేసిన ఒక అత్యంత ఖరీదైన లగ్జరీ బంగ్లాకు సంబంధించిన ఇంటీరియర్ విశేషాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
ముంబైలోని మోస్ట్ ప్రెస్టీజియస్ ఏరియా అయిన బాంద్రా వెస్ట్‌లోని కార్టర్ రోడ్లో తృప్తి డిమ్రి ఈ డ్రీమ్ హోమ్‌ను సొంతం చేసుకున్నారు. సెలబ్రిటీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ ప్రాంతంలో గ్రౌండ్ ప్లస్ టూ ఫ్లోర్స్ (మూడు అంతస్తులు) ఉన్న ఒక విలాసవంతమైన బంగ్లాను దాదాపు రూ. 14 కోట్లు వెచ్చించి ఆమె కొనుగోలు చేశారు. మిగతా సెలబ్రిటీల ఇళ్లలా ఆడంబరంగా కాకుండా, ఎంతో సింపుల్‌గా, క్లాసిక్ లుక్‌తో ఈ ఇల్లు అలరిస్తోంది.
ఈ లగ్జరీ బంగ్లాలో ప్రధాన ఆకర్షణగా నిలిచేవి ఇందులోని అద్భుతమైన గ్లాస్ ఇంటీరియర్స్. ఇల్లంతా సహజమైన సూర్యరశ్మితో ప్రకాశవంతంగా కనిపించేలా పెద్ద పెద్ద గ్లాస్ ప్యానెల్స్, క్లియర్ గ్లాస్ డివిజన్లను ఉపయోగించారు. ఇది ఇంటికి మరింత స్పేషియస్ అండ్ బ్రీజీ లుక్‌ను ఇస్తోంది. ఇక లివింగ్ రూమ్‌లోని పిస్తా కలర్ సోఫా, పింక్ వెల్వెట్ వాల్స్ కాంబినేషన్ చూస్తే తృప్తి డిమ్రి అభిరుచి ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది.
ఇంటి వెనుక భాగంలో ఒక ప్రశాంతమైన స్విమ్మింగ్ పూల్ ఏరియా ఉంది. చుట్టూ పచ్చని మొక్కలు, సీ-గ్రీన్ కలర్ వాటర్ ఉన్న ఈ పూల్ సైడ్ స్పేస్‌ను తృప్తి తన మార్నింగ్ యోగా, మెడిటేషన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నారు. అలాగే బెడ్రూమ్లో అమర్చిన ప్రత్యేకమైన షాడో ల్యాంప్స్, గోడలపై జంతువుల నీడలను ప్రతిబింబిస్తూ ఆర్టిస్టిక్ అండ్ మోడ్రన్ గ్లామర్ లుక్‌ని ఇస్తున్నాయి.
పచ్చదనం అంటే ఎంతో ఇష్టపడే ఈ నటి, తన విశాలమైన బాల్కనీని రకరకాల పూల కుండీలు, లష్ గ్రీన్ ప్లాంట్స్‌తో ఒక చిన్న తోటలా మార్చేసారు.సినిమాల్లో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తృప్తి డిమ్రి, 30 ఏళ్ల వయసులోనే ముంబై వంటి నగరంలో ఇంతటి భారీ బంగ్లాను సొంతం చేసుకోవడంపై నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. హార్డ్ వర్క్ తోనే ఈ స్థాయికి చేరిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ నేషనల్ క్రష్ త్వరలోనే కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘ధడక్ 2’ తో పాటు పలు క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
![]() |